సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువమంది భక్తులు దర్శించుకొనే దేవాలయాలలో, నిర్వహణలో అగ్రస్థానంలో ఉండే.. భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో శ్రీ అమ్మవారికి నిత్యా పూజలు, యజ్ఞాలు కు ప్రసాదాలు కు భక్తులు చెల్లించే రుసుములు పెరిగాయని వాటిని భక్తులు గమనించాలని దేవాలయ సహాయ కమిషనర్, యర్రంశెట్టి భద్రజీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లు ధరలు విపరీతముగా పెరిగినందున దేవస్థానము అభివృధ్ది, నిర్వహణలో భాగంగా అగు ఖర్చుల దృష్ట్యా దేవాలయ అర్చక స్వాములు, ధర్మకర్తల మండలితో చర్చించి నిర్ణయించామని, సదరు విషయమును భక్తుల సలహా, సూచనలు, అభ్యంతరాలు తెలిపేందుకు వివిధ ప్రభుత్వ కార్యాలయముల నోటీసు బోర్డుల యందు ది.28.3.2023 ఉంచడమైనది అని తెలిపారు దీనిపై కమీషనరు, దేవదాయ ధర్మదాయ శాఖ, గొల్లపూడి, విజయవాడ వారు పూజ రుసుములు, సేవ రుసుములు పెంపుదల ఆమోదించారని, సదరు ఉత్తర్వులను అనుసరించి రుసుముల పెంపుదల చేశామన్నారు. ఫై చిత్రంలో కొత్త రుసుములు వివరాలు చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *