సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఆలయంలో నేడు, శనివారం (24-02-2024 ) పౌర్ణమి సందర్భంగా ప్రజల సుఖ సంతోషాల కోసం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య చండీహోమం నిర్వహించారు. 88 మంది దంపతులు ఈ హోమం లో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ఆలయ ధర్మకర్తలి మండలి చైర్మన్, మానేపల్లి నాగేశ్వరరావు సభ్యులు ముత్యాల రామారావు , మావూరి సుందరరావు, తాళ్లపూడి భాగ్యలక్ష్మి ఈ హోమం లో పాల్గొన్నారు.
