సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ట మాసం జాతర మహోత్సవాలలో భాగంగా నేడు, గురువారం మద్యాహ్నం మేళతాళాలతో బాణాసంచా కాల్పులతో డప్పు వాయిద్యాలతో కళాకారుల ప్రదర్సనలతో పుష్ప రధం ఫై శ్రీ అమ్మవారి నగరోత్సవం ను ప్రత్యేక పూజలు అనంతరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. దేవస్థానము, నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో జ్యేష్ఠ మాస జాతర మహోత్సవాన్ని నిర్వహించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ, అర్చక బృoదం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు జాతర మహోత్సవము నిర్వహణ నిమిత్తం దేవస్థానము నుండి రూ 2 లక్షలను ఎమ్మెల్యే చేతుల మీదుగా నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటి అద్యక్షులు రామాయణం గోవిందరావుకి అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, జిల్లా జనసేన పార్టి అద్యక్షులు కోటికలపూడి గోవిందరావు, కోళ్ళ నాగేశ్వరరావు, కార్మురి సత్యనారాయణ, దేవాలయ సహాయ కమిషనర్, బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఉత్సవ కమిటి సభ్యులు పాల్గొన్నారు.
