సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, ఆదివారం ఉదయం దర్శించుకున్న స్థానిక భక్తులు అడపా రామకృష్ణ పార్వతి దంపతులు శ్రీ అమ్మవారి దేవాలయంలో నిత్యం భక్తుల కోసం నిర్వహిస్తున్న అన్నసమారాధన కార్యక్రమం కోసం 50,000 రూపాయలు కానుక గా అందజేశారు. వీరికి ఆలయ ఉపప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు శ్రీ అమ్మవారి పూజలు నిర్వహించగా ,ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వీరికి శేషవస్త్రం,ప్రసాదం,ఫోటో అందించారు.
