సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, ఆఖరి శ్రావణ శుక్రవారం నేపథ్యంలో మహిళా భక్తులు సందడి ఎక్కువగా ఉంది. నేటి ఉదయం , శ్రీ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు అయితం శ్రీనివాస్ నాగలక్ష్మి దంపతులు వారి కుమార్త ప్రణతి పేరు మీద (1,00,116.) లక్ష నూట పదహారు రూపాయలు అమ్మవారి దేవాలయంలో నిత్యం జరిగే భక్తులకు అన్నసమారాధన కోసం .. శాశ్వత నిత్యాన్నదానం ట్రస్ట్ కి కానుకగా అందించారు. .వీరికి ఆలయ ఉప ప్రధానఅర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించి ప్రసాదాలు శేషవస్త్రం ఫోటో అందచేసినారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
