సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, ఆదివారం దర్శించుకొన్నస్థానిక చినఅమిరంకి చెందిన భక్తులు సింగంశెట్టి వెంకట చైతన్య లక్ష్మి దంపతులు శ్రీ అమ్మవారి దేవాలయంలో ప్రతి రోజు భక్తుల కోసం నిర్వహించే నిత్యా అన్నదానం ట్రస్ట్ కోసం 50,000( యాభై వేలు రూపాయలు) కానుక గా అందించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు మరియు ఆశీర్వచనాలు ఇప్పించగా, .ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ఫోటో ప్రసాదాలు అందజేశారు.
