సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని నేడు, ఆదివారం ఆంధ్రప్రదేశ్, డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. సంక్రాంతి నుండి నెల రోజులు పాటు జరిగే శ్రీ అమ్మవారి ఉత్సవాల ఏర్పాట్లను వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదాలు శేషవస్త్రం శ్రీ అమ్మవారి ఫోటో అందించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అడిషినల్ ఎస్పీ భీమారావు,జనసేన ప్రోటోకాల్ ఛైర్మన్ తిరుమలరావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం తదుపరి భీమవరంలోని పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామివారిని కార్యనిర్వహణాధికారి రామకృష్ణంరాజు పర్యవేక్షణలో ఆలయ మర్యాదలతో డీజీపీ కుటుంబసమేతంగా దర్శించుకొన్నారు.
