సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో నేడు, గురువారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మాలధారణ పాద మండల దీక్షలు నిర్వహించారు. గత నెల 7 వ తేదీ నుండి మండల దీక్ష తదుపరి అర్ధమండల దీక్ష అనంతరం తాజగా నేటి ఉదయం పాదమండల దీక్షలు మాలధారణ చేసేవారి కోసం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ కలశస్థాపన పూజ జరిపి, ప్రారంబించగా 255 మంది.. దీక్షా మాలలు ధరించారు.. ఈసారి విశేషం గా యువతులు ఎక్కువ దీక్ష ధారణ చెయ్యగా వారిలో యువకులు,చిన్నపిల్లలు కూడా దీక్షలు ధరించారు. రేపు 7 వ తేది శుక్రవారం సాయంత్రం మాలధారణ భక్తులు ఆధ్వర్యంలో. పెద్ద ఎత్తున లక్ష వత్తులు దీపాలంకరణ, 9 వ తేదీ ఆదివారం సాయంత్రం భారీ పడిపూజ నిర్వహించనున్నారని అని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలుపుతూ..మరియు దీక్షవిరమణ ఈనెల 16 ఆదివారం జరుపబడునని తెలిపారు. (పాద మండల దీక్ష తీసుకొన్న వందలాది యువత ను ఫై తాజా దృశ్యంలో చూడవచ్చు..)
