సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, గురువారంతెల్లవారు జామున..విశేషంగా . అమ్మవారి భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ద్వారా 40రోజుల దీక్షకు శ్రీ అమ్మవారి మాలధారణ ధరింప చేసారు. భక్తులు ఎర్రటి దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు చేయించిన తదుపరి అమ్మవారి దీక్షా ధారణ చేయించడం జరిగింది. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో నేటి ఉదయం అశ్వయుజ పౌర్ణమి సందర్బంగా చండీ హోమం ఘనంగా జరిగింది, విశేషంగా దంపతులు పాల్గొన్నారు. ఈకార్యక్రమలలో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహనదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ మరియు ఆలయ సిబ్బంది , భక్తులు పాల్గొన్నారు
