సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శనివారం కేరళ నృత్య కళాకారుల వాయిద్య బృందం కేరళా వాయ్యిద్యాలతో నాద్య విన్యాసం చేసారు. దాదాపు 2 గంటల పాటు ఆలయం కళాకారుల వాయిద్యంతో మారుమ్రోగింది. కేరళ ఏర్నాకులంకు చెందిన శివరత్న, శివకృష్ణరాధిక, శివ రాధిక కుటుంబ సభ్యులచే (రాధాకృష్ణ హోటల్ వారు) అమ్మవారికి మొక్కును తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కేరళా నుంచి విశేషంగా కళాకారులను తీసుకువచ్చి వాయిద్య విన్యాసం చేయించారు. కళాకారులు తమ ప్రతిభను చూపుతూ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తన్మయత్వంతో తిలకించారు. అనంతరం కళాకారులను, మొక్కు తీర్చుకున్న కుటుంబ సభ్యులను ఆలయ ప్రధానార్చకుడు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. వీరికి ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదాలు అందచేసినారు.
