సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం పురాధీశ్వరి, శ్రీశ్రీశ్రీమావుళ్ళమ్మ అమ్మవారి 61వ మహోత్సవాలు ముగింపు నేపథ్యంలో నేటి శుక్రవారం ఉదయం 7న్నర గంటలకు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో ఉన్న శ్రీ అమ్మవారి ఆవరణలో భారీ పంచభక్ష పరమాన్నాలతో ఏర్పాటు చేసిన భారీ నైవేద్య కార్యాక్రమం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో లక్ష మంది భక్తులకు అన్నసమారాధన కార్యక్రమంను స్థానిక , ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దంపతులు ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జునశర్మ అధ్వర్యంలో పూజ కార్యక్రమాలను చేపట్టగా మహా నివేదనకు హారతులు ఇచ్చి అన్న సమారాధనను ప్రారంభించారు. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మహానైవేద్య సమర్పణ అనంతరం 36 కేజీల లడ్డూను రూ లక్ష 10 వేలకు పట్టణానికి చెందిన పడమటి రామకృష్ణ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, టీడీపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, మెరగాని నారాయణమ్మ, ఆలయ సహాయ కమిషనర్ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం సభ్యులు కొప్పుల సత్తిబాబు, రామాయణం గోవిందరావు, తూటరపు ఏడుకొండలు, రామాయణం సత్యనారాయణ, సభ్యులు, మాజీ ట్రస్ట్ సభ్యులు కారుమూరి సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
