సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి వందలాది దీక్షాపరులచే నేటి గురువారం సాయంత్రం దేవాలయం నుండి కార్తీక జ్యోతి ఊరేగింపు ప్రారంభించారు. దీక్షాపరులు అందరు పట్టణ విధుల గుండా కోలాహలంగా కార్తీక దీపాలు చేతబూని శ్రీ అమ్మవారి నామ జపంతో శ్రీ మావుళ్ళమ్మవారి చిత్ర కటౌట్ వాహనంతో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ మరియు దేవాలయ సిబ్బంది ఈ ఊరేగింపులో పాల్గొన్నారు
