సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59వ వార్షిక మహోత్సవాలలో భాగంగా నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం, మావుళ్లమ్మ ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో గత ఆదివారం రాత్రి ప్రముఖ హీరో జెడి చక్రవర్తి ని స్థానిక జేపీ రోడ్ లోని ఆనంద హోటల్ నుండి హంస వాహనంపై ఊరేగింపుగా చిన్న వంతెన ఫై నుండి తీన్మార్ వ్యాయిద్యాలతో ఊరేగింపుగా దేవాలయం వద్ద కు తీసుకోని వచ్చి శ్రీ అమ్మవారి దర్శనం చేయించి తదుపరి కళావేదికపై వేలాది భక్తుల సమక్షంలో బంగారు హస్తాభరణం తో ఘన సన్మానం నిర్వహించారు. గులాబీ, మని , బొంబాయి ప్రియుడు, హోమం వంటి సినిమాలతో తెలుగు వారికే కాదు సత్య సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన పాలోయింగ్ సాధించిన జెడి చక్రవర్తి హుషారుగా మాట్లాడారు.. నేను తెలిసి, తెలియక ఎన్నో పాపాలు చేసి ఉంటాను.. మావుళ్లమ్మ దర్శనంతో అవన్నీ పోయానని భావిస్తున్నా’…ఎంతో పుణ్యం చేసుకుంటే ఇక్కడ మావుళ్ళమ్మవారి సన్నిధిలో అమ్మ ఆశీస్సులతో ఈ సన్మానం జరుగుతుందంటున్నారు..మావుళ్లమ్మ తల్లి సమక్షంలో సన్మానం జరగడం ఆనందంగా ఉంది. ఇక్కడకు రావడం.. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు. సభకు అధ్యక్షత డాక్టర్ చీడే సత్యనారాయణ వహించగా, డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఆలయ పాలకవర్గ చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు దేవాలయ సహాయ కమిషనర్ వై భద్రాద్రి తదితరులు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రామాయణం గోవిందరావు చక్రవర్తిని సువర్ణ హస్తా భరణంతో గోవిందరావు సత్కరించగా, జ్ఞాపికను రామాయణం సత్యనారాయణ, కొప్పుల సత్తిబాబు అందించారు. వ్యాఖ్యాతగా దాయన సురేష్ చంద్రజీ వ్యహరించగా కాగిత వీర మహంకాళీ రావు,తుటారపు ఏడుకొండలు, రామాయణం చిన్నారి, మానే తేజ సురేష్. తదితరులు ఉన్నారు.
