సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేవదాయ ధర్మదాయ శాఖ అద్వర్యం లో ధర్మప్రచారంలో భాగంగా నేడు,శ్రావణ శుక్రవారం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు సుమారుగా 1000 మంది మహిళ భక్తుల చే సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతములకు అవసరమగు పూజ ద్రవ్యములు, లక్ష్మీదేవిరూపు, మావుళ్ళమ్మ అమ్మవారిఫోటో దాతలు మరియు దేవస్తానం వారి సహకారంతో భక్తులకి అందజేశారు. ఈ పూజ కార్యక్రమములు ఆలయ ప్రధానర్చుకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేదపండితులు భక్తులందరికీ పూజ ఆశీర్వచనలు అందజేశారు. . పూజ అనంతరం సుమారుగా 2000 మందికి అన్నప్రసాద వితరణ జరిగిందని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ జిల్లా అధికారి E సుబ్బారావు,దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ V వెంకటేశ్వరరావు మరియు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు ధర్మకర్తలు రామాయణం సత్యనారాయణ, ముత్యాల వెంకటరామారావు, మావూరి సుందరరావు, ch శేషగిరి , తాళ్లపూడి భాగ్యలక్ష్మి , కోయ వెంకటలక్ష్మి , గోపిశెట్టి విజయలక్ష్మి , నీలాపు నాగలక్ష్మి పాల్గొన్నారు.
