సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, బుధవారం అక్షయ తృతీయ నేపథ్యంలో నేడు బుధవారం ఉదయం మహిళలలకు ఉచితంగా సంప్రదాయ బద్దంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి హోమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ అధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఆలయ ప్రాంగణంలో 300 మంది భక్తుల సమక్షంలో వేదపండితులు వేద మంత్రాలతో మహాలక్ష్మి హోమం నిర్వహించారు. ప్రజలు అందరికి సిరి సంపదలు భాగ్యం కొసం అద్భుతమైన మహా సంకల్పంతో ఈ హోమం నిర్వహించామని మరియు విచ్చేసిన భక్తులకు చక్రపొంగలి పులిహోర కుంకుమ ప్రసాదాలు అందచేసినామని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్య నిర్వహణధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
