సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో ఎల్లుండి 19 వ తేదీ గురువారం పరాభనామ సంవత్యరం ఉగాది వేడుకలు అత్యంత వైభముగా నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు పంచాంగ శ్రావణం అనంతరం కాళ్ల శివాలయం అర్చకులు తుమ్మపూడి శివ నాగ సత్య శ్రీను సీతారామ ప్రసాద్ కు సత్కారం చేయుచున్నారు. సాయంత్రం 6 గంటలకు గొల్లలకోడేరు వాస్త్యవ్యులు అవధానరాజహంస సవస్రావధాన భాస్కర అవధానవిద్యా విరించి గౌ కోట వెంకట లక్ష్మి నరసింహం వారిచే ప్రవచన కార్యక్రమం జరుగుతుందని దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
