సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జేష్ఠమాస జాతర మహోత్సవాలు లో భాగంగా శ్రీ అమ్మవారికి పలు సేవలు జరుగుతున్నాయి. నేడు, మంగళవారం శ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకున్న భక్తులు ముదునూరి కైలాష్ వర్మ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రo తయారీలో తన వంతుగా 8 గ్రాముల బంగారం కానుకగా సమర్పించారు. వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించి ప్రసాదం శేషవస్త్రం అందచేసినారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
