సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారికి భక్తులు ఆలయ హుండీ ద్వారా చెల్లించిన కానుకలను గత మంగళవారం లెక్కించారు. ఈ నేపథ్యంలో హుండీలలో డబ్బు రూపంలో ఆదాయం రూ.70,07,033./ అక్షరాల డబ్భై లక్షల ఏడు వేల ముప్పై మూడు రూపాయలు, మరియు శ్రీ అమ్మవారి అన్నదానం హుండివలన 1,04,177./ ఒక లక్ష నాలుగు వేల నూట డబ్భై ఏడు రూపాయలు,మొత్తం శ్రీ అమ్మవారి ఆదాయం 71,11,207. అక్షరాలా డబ్భై ఒక లక్ష పదకొండు వేల రెండు వందల ఏడు రూపాయలు. బంగారం కానుకలుగా 133 గ్రాముల 500మిల్లీలు, వెండి 880 గ్రాములు లభించాయి. ఇవికాక.. విదేశీ కరెన్సి అమెరికాకి చెందిన 56 డాలర్లు,UAE దేశానికీ చెందిన 105 దిర్హామ్స్, కెనడాకు చెందిన 5 డాలర్లు , బ్రిటన్ దేశానికి చెందిన 10 పౌండ్లు, సమర్పించుకున్నారు.ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ,తనిఖీదారివారు వి వెంకటేశ్వరరావు, బ్యాంకు సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *