సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, బుధవారం హుండీలు తెరచి భక్తులు సమర్పించిన కానుకలు తెరచి,లెక్కించగా 30 రోజుల కాలానికి వచ్చిన ఆదాయం వివరాలు: భక్తులు హుండీల ద్వారా మొత్తం ఆదాయం రూ.21,06,063./ అక్షరాలా ఇరవై ఒక లక్ష ఆరు వేల అరవై మూడు రూపాయలు, బంగారం 38 గ్రాములు 500 మిల్లీలు వెండి 120 గ్రాములు మరియు పలు దేశముల విదేశీ కరెన్సి శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా సమర్పించుకున్నారు.ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, తనిఖీదారివారు వి వెంకటేశ్వరరావు, ఈఓ దండు కృష్ణం రాజు మరియు కరూరి వైశ్య బ్యాంకు సిబ్బంది పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
