సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60 వ జాతర మహోత్యవాలు లో 33 రోజుల పాటు భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలు నిన్న 9 హుండీలను లెక్కించగా , నేడు, మంగళవారం మిగిలిన హుండీలను తెరచి లెక్కించగా నేటి ఆదాయం రూ. 13,98,073/- అక్షరాల పదమూడు లక్షల తొంబై ఎనిమిది వేల డబ్బై మూడు రూపాయలు వచ్చింది. దానిని నిన్న 9 హుండి ల ఆదాయం రూ. 63,98,749/- తో రూ. 13,98,073/- కలుపగా వెరశి రూ. 77,96,822/- లు మొత్తం ఆదాయం వచ్చినది. ఈ యొక్క లెక్కింపు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ ఆద్వర్యoలో తనిఖీదారువారు వి వెంకటేశ్వరరావు ఈఓ కర్రీశ్రీనివాస్, ఈఓ ఎం అరుణ్ కుమార్ మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు(నాగన్న బాబు) పర్యవేక్షించారు. దీనిలో ధర్మ కర్తలు ముత్యాల వెంకట రామారావు, చెల్లంకి నాగ శేషగిరి, మావూరి సుందరరావు, రామాయణం సత్యనారాయణ, గోపిశెట్టి విజయలక్ష్మి,కోయ వెంకట లక్ష్మీ , నీలాపు విజయ నాగలక్ష్మి, బ్యాంకు సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. . .
