సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:సంక్రాంతి పండుగ మొదలుకొని నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలు అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఎంతో ఆసక్తి.. మరి మరో 2 రోజులలో ప్రారంభం కానున్న ఉత్సవాల నేపథ్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ( నీరుల్లి కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో..)అధ్యక్షులు రామాయణం గోవిందరావు తో కలసి మిగతా సభ్యులు నేటి గురువారం ఉదయం .శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60 వ వార్షిక జాతర మహోత్సవాలు వాల్ పోస్టర్ ను , బుక్ లెట్స్ ను స్థానిక వారి కల్యాణమండపంలో విడుదల చేసారు. తదుపరి మీడియా తో మాట్లాడుతూ.. ఈసారి వేడుకలు ఈ నెల 13వ తేదీన ప్రారంభించి ఫిబ్రవరి 6వ తేదీ వరకు నిర్వహిస్తామని వీటిలో నాటక కళాకారులూ 20 నాటకాలు తో పాటు, మ్యూజికల్ నైట్స్, బుర్రకథలు, హరికథలు, భరత నాట్యాలు వంటి ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని , లైటింగ్ సెటింగ్స్, ప్రత్యక ఆకర్షణగా ఉంటాయని సుమారు కోటి రూపాయలు ఖర్చుతో నిర్వహించే ఈ వేడుకలకు దేవాదాయ శాఖ 15లక్షలు రూ మంజూరు చేసిందని, ఈసారి వేడుకలలో సువర్ణ కంఠాభరణం సన్మానం కోసం సినీప్రముఖులు ను ఆహ్వానించలేదని తెలిపారు. పిభ్రవరి 9వ తేదీ శుక్రవారం లక్ష మంది భక్తులకు అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *