సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59వ వార్షికోత్సవాలు ముగింపుగా నేడు, శుక్రవారం ఉదయం 7న్నర శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో ఉన్న శ్రీ అమ్మవారికి ఎదురుగ హాలులో పంచభక్ష పరమణాలతో మిఠాయిలతో మహా నివేదన ను వేదమంత్రోచ్చారణ హారతుల మధ్య స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమర్పించారు. ఈ సందర్భముగా ఆలయ మర్యాదలతో శ్రీ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రీ అమ్మవారి కరుణా కటాక్షాలతో భీమవరం నియోజకవర్గ అబివృద్ధి దినదిన ప్రవర్ధమాన మౌతుందని , ఇక్కడి ప్రజలు తో పాటు ఎంతో దూరప్రాంతాల నుండి ఆమెను కొలుచుకొంటున్న భక్తులు సుఖశాంతులు తో ఏ లోటు లేకుండా సుభిక్షంగా ఉండాలని, కోరుకుంటున్నట్లు , ఉత్సవాలు ఘనంగా, చక్కగా నిర్వహించడానికి కారణమైన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు తెలిపారు.
