సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో గతంలో ప్రతిపాదించిన వివిధ అదుణీకరణ, భక్తులకు మరిన్ని సౌకర్యాల కోసం దేవాలయ నూతన అభివృద్ధి పనులు ఏర్పాటు విషయంలో, రంగుల అలంకరణ ప్రణాళిక, వ్యయం అంచనాలు రూపొందించే క్రమంలో భాగముగా నేడు, శుక్రవారం దేవస్థానాన్ని దేవదాయ ధర్మదాయ శాఖ ఇంజినీరింగ్ విభాగం వారు కాకినాడ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ T దుర్గేష్ కుమార్, కాకినాడ డిప్యూటీ స్థపతి A శ్రీనివాసాచారి, భీమవరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ sk సైదా ,భీమవరం అసిస్టెంట్ ఇంజినీర్ న. రాజ్ కుమార్, సైట్ ఇంజనీర్ హేమంత్ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ని సందర్శించారు.సమగ్ర పరిశీలన అనంతరం ప్లాన్ లు తయారు చేయిస్తామని దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ .ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ కు తెలిపారు. నేడు, శుక్రవారం ఉదయం .శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న కాకినాడకు చెందిన కే. సత్యశ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులు 8 గ్రాముల బంగారం అమ్మవారికి కానుకగా అందించారు. అని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *