సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో నేడు, గర్భాలయం తలుపులు తెరిచి శ్రీ అమ్మవారి పునఃదర్శనం ప్రారంభించిన నేపథ్యంలో స్థానిక భక్తులు U దుష్యంత్ కుమారి అరుణకుమారి దంపతులు శ్రీ అమ్మవారికి 24 గ్రాముల బంగారం కానుకగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతులు మీదగా అందచేసినారు. ( వారు ఫొటోలో లేరు. బంగారం రసీదు మాత్రం ఎమ్మెల్యే చేతిలో ఫై చిత్రంలో చూడవచ్చు) వీరికి ఆలయ ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం అందజేసి శ్రీ అమ్మవారి అస్సిసులు అందజేశారు.ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ,, ఇప్పటి వరకు భక్తుల నుండి 74 కేజీల బంగారం సేకరించామని, అందులో 50 కేజీల బంగారంతో తొడుగు చేయించామని, మిగిలిన 24 కేజీల ఉందని, పండుగ వెళ్లిన తరువాత వాటితో కొంత భాగాన్ని తయారుచేయిస్తామని, మరొక 26 కేజీలు కలిపి అమ్మవారికి నిలువెత్తునా బంగారం ఉండేలా దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నామని అన్నారు. ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో అమ్మవారి దేవస్థానంకు 3 షిఫ్టుల్లో 6 గురు గన్ మెన్ లతో ఆలయానికి భద్రత కల్పించాలని కోరడం జరిగిందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, శ్రీ అమ్మవారి నిలువెత్తు దివ్యమంగళపునర్ దర్శనం కోసం వందలాదిగా భక్తులు క్యూ లైన్ లలో నిలబడి దర్శించుకొన్నారు.
