సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ జాతర మహోత్సవాలను ఈనెల 13వ తేదీ నుంచి పిబ్రవరి 14వ తేదీ వరకు ఈసారి 33 రోజులు పాటు నిర్వహిస్తున్నట్లు నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు, అదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సుమారు కోటి రూపాయలు వ్యయం తో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ( రాష్ట్ర దేవాదాయ శాఖ కు 20 లక్షల నిధుల కోసం విజ్ఞప్తి చెయ్యగా 15 లక్షలు మంజూరు చేసినట్లు సమాచారం.ఇంకా 5 లక్షలకు ప్రయత్నాలు చేస్తున్నారు) ఈనెల 13వ తేదీ రేపటి సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబుచే అమ్మవారి గ్రామోత్సవము, సాయంత్రం మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 14న భక్తులకు అన్న సమారాధన నిర్వహిస్తున్నామని అన్నారు. మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం చుట్టూ ఈసారి కొత్త పద్దతిలో ప్రత్యేక లైటింగ్ సెట్టింగ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. కళాకారులను ప్రోత్సహిస్తూ 24 పౌరాణిక నాటకాలు, 5 బుర్రకథలు, 9 హరికథలు, 14 సంగీత విభావరి, మ్యూజికల్ నైట్స్, 22 కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నమని తెలిపారు. అనంతరం ఉత్సవాల బ్రొచర్ ను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 6 నుంచి వరుసగా 8 రోజులపాటు శ్రీ అమ్మవారికి అష్టలక్ష్మీ అలంకరణలు దేవాలయంలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ సభ్యులు తుటారపు ఏడుకొండలు, రామాయణం గోవిందరావు, కొప్పుల సత్తిబాబు, రామాయణం చిన్నారి, కట్టా కొండ, నరహరిశెట్టి సూర్యనారాయణ, రామాయణం శ్రీనివాసరావు, మానే భాస్కరరావు, మానే తేజ, ఆకుల సోమేశ్వరరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
