సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు కే రాంబాబు సునీత దంపతులు 8 గ్రాముల బంగారం జడ్డు పవన్ కుమార్ 4 గ్రాముల బంగారం కానుకగా అందజెయ్యడం జరిగింది. వీరిచే ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు శ్రీ అమ్మవారి పూజలు నిర్వహించి ప్రసాదాలు శేషవస్త్రం అందచేసినారని, నేడు, శనివారం పౌర్ణమి నేపథ్యంలో దేవాలయంలో చండి హోమం ఘనంగా జరిగిందని, 55 మంది దంపతులు పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
