సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు భారీ పందిళ్లు మధ్య 11 రోజుల పాటు జరిగే దసరా వేడుకల శోభా నేటి నుండే ప్రారంభం అయ్యింది. నేటి మద్యాహ్నం శ్రీ అమ్మవారి శోభా యాత్ర పుర విధుల గుండా జరగనుంది.ఇదిలా ఉండగా నేడు, ఆదివారం అమావాస్య సందర్భంగా చండీహోమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేదపారాయణ దారులు నిర్వహించారు. 62 మంది దంపతులు ఈ హోమం లో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
