సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, మంగళవారం అమావాస్య సందర్భంగా శ్రీ అమ్మవారి భక్తులకు సర్వశుభాలు కాంక్షిస్తూ ‘చండీహోమం’ ను ఆలయ అర్చకులు మద్దిరాల రమణ శర్మ మరియు వేదపారాయణ దారులు నిర్వహించారు. ఈ హోమం కార్యక్రమంలో 49 మంది దంపతులు పాల్గొన్నారని దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ప్రతి అమావాస్య, పౌర్ణమి కి దేవాలయం ఆవరణలో జరిగే చండి హోమంలో పాల్గొనాలి అనుకొనే భక్తులు ఒకరోజు ముందుగా దేవాలయం ఆలయంలో తమ పేరు నమోదు చేసుకోవలసి ఉంది.
