సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, శుక్రవారం అమావాస్య నేపథ్యంలో భక్తులు కష్టాలు తొలగిపోయి..సిరి సంపదలు పొందాలి అన్న సంకల్పంతో.. విశేషమైన చండీహోమం దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు మరియు వేదపారాయణ దారులు ఘనంగా నిర్వహించారు. ఈ హోమం వద్ద 60 మంది పైగా దంపతులు పాల్గొన్నారని, పరోక్ష పధ్ధతిలో కూడా.. మరి కొంతమంది భక్తులు పాల్గొన్నారు అని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
