సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా వేడుకలు ప్రారంభంగా నేటి సోమవారం శ్రీ అమ్మవారు శ్రీ స్వర్ణ రజిత కవచ అలంకరణలో దర్శమిచ్చారు. భక్తులు విశేషంగా దర్శించుకొంటున్నారు. ఇక శ్రీ మావుళ్ళమ్మవారి దసరా వేడుకలు నేటి సోమవారం నుండి అంటే ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు రాష్ట్రదేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తదుపరి అక్టోబర్ 4వతేదీ ఉదయం 10 గంటల నుండి భక్తులకు మహా ప్రసాద వితరణ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు నిలువెత్తు మూలవిరాట్ స్వరూపంలో శ్రీ అమ్మ వారు 11 రోజుల పాటు పలు దేవి అవతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దేవాలయ ఆవరణలో ప్రత్యేక కుంకుమ పూజలతో పాటు ప్రతి సాయంత్రం 4 గంటల నుండి వేదిక ఫై పలు ఆధ్యాత్మిక,సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భారీ పందిళ్ళతో అందమైన లైటింగ్ అలంకరణలు చేసారు. భక్తులకు శ్రీ అమ్మవారి దర్శనం వేగంగా జరిగేటట్లు సౌకర్యాల విషయంలో ఇబ్బందులు లేకుండా విశేష ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
