సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 62 వ వార్షిక ఉత్సవాలు ఈనెల 13న ప్రారంభం అయ్యాయి. సంక్రాంతికి భీమవరం వచ్చిన లక్షలాది అతిదులతో పాటు వారిలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో గత 4 రోజులుగా దేవాలయం ఆవరణ భక్తులతో కిటకిట లాడుతుంది. గత శుక్రవారం రాత్రి తీర్ధం లో నిజంగానే వేలాది భక్తులు తో ఇసుక వేస్తె క్రిందకు రాలనంత సమూహాలతో సందడి కనపడింది. సుమారు 15వేల మంది శ్రీ అమ్మవారిని దర్శించుకోగా తీర్ధంలో లైటింగ్ సెట్టింగ్ అలంకరణలు చూడటానికి 20వేలమంది పైగా పాల్గొన్నారు. నేటి శనివారం ఉదయం నుండి శ్రీ అమ్మవారి దర్సనం కోసం భక్తులు పోటెత్తిపోతున్నారు. నేటి శనివారం మధ్యాహ్నం 4 గంటలకు దేవాలయంవద్ద కిలో మీటర్ చప్పున భక్తులు క్యూ లైన్ లలో శ్రీ అమ్మవారి దర్సనం కోసం నిరీక్షిస్తున్నారు. భారీ క్యూ లైన్ లలో భక్తులు ను ఈ సారి ఐడీబీఐ బ్యాంకు వైపు కాకుండా ఛాంబర్ వైపు నిలబెట్టడం తో కొంత సండే మార్కెట్ లో ట్రఫిక్ ఇబ్బంది తొలగింది. అటుగా వాహనాలను నిషేదించారు. పోలీసులు చక్కగా పని చేసి వన్ టౌన్ లో ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కానీ, ఉత్సవ భారీ పందిళ్ళ లో వేలాది జనం మధ్య ఎటువంటి త్రొక్కిసలాటలు లేకుండా చూస్తున్నారు . రేపు ఆదివారం తరువాత బయటి ప్రాంతాల అతిధుల సంఖ్యా తగ్గే అవకాశం ఉంది.
