సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణవస్త్రo కి నేడు, గురువారం ఉదయం కోలమూరు కి చెందిన పేరిచర్ల కనకరాజు రామసీత దంపతులు 39000 రూపాయలు విలువచేసె 4 గ్రాముల బంగారం కానుకగా అందించారు. వారికీ శ్రీ అమ్మవారి శేషవస్త్రం ప్రసాదాలు ఫోటో వీరికి అందించారు. ఇక శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం యొక్క ఉపాలయం అయినటువంటి శ్రీగణపతి స్వామివారి నవరాత్రులలో భాగంగా దేవస్థాన విద్వాంసులుచే నాదశ్వర కచేరి కార్యక్రమం జరిగింది. దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ మన సిగ్మా న్యూస్ తో మాట్లాడుతూ.. శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ఈ నెల 7 వ తేదీ ఆదివారం చంద్ర గ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 12.30 గంటలకు మహానివేదన అనంతరం దేవస్థానం కవాట బంధనం ( దేవస్థానం లో దర్శనంలు నిలుపుదల చేయబడును ) మరుసటిరోజు 8వ తేది సోమవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో సంప్రోక్షణ జరిపిన అనంతరం 8.30 గంటలనుండి యధావిధిగా దర్శనాలు అనుమతించబడతాయి అని తెలిపారు.
