సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం సాయంత్రం భీమవరం పురాధీశ్వరి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జేష్ఠమాస జాతర మహోత్యవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రారంభంగాను అమ్మవారిని నిలబెట్టే కార్యక్రమం దేవాలయంలో మేళ తాళాలతో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పుట్టింటి, అత్తింటి వారు అల్లూరి, మెంటే వంశస్తులుచే ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి వెండి ఘటాల పూజాకార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మే 29 వ తేదీన ప్రారంభమైన ఈ జాతర మహోత్సవాలు వచ్చే జూన్ నెల 25వ తేదీవరకు నిర్వహిస్తారు. జూన్ 19వ తేదీన గురువారం మధ్యాహ్నం శ్రీ అమ్మవారి నగరోత్సవం, సాయంత్రం వైభవం గా నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో వందలాది కళాకారులతో, శక్తి వేషాలతో జాతర మహోత్సవం అర్ధరాత్రి వరకు జరుగుతుంది. ఈనేపథ్యంలో ఈ జేష్ఠమాసం లో ప్రతిరోజూ శ్రీ అమ్మవారి వెండి ఘట్టాలతో ఇంటింటికి వచ్చి శ్రీ మావుళ్ళమ్మవారి అస్సిసులు మహిళలకు పసుపు కుంకుమ అందజేస్తారు.
