సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానం నందు ఈనెల 30 వ తేదీ బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా ప్రజలు అందరికి సిరి సంపదలు భాగ్యం కొరకు అద్భుతమైన మహా సంకల్పం తో ఆరోజు ఉదయం 8-00 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి హోమం నిర్వహించబడుతోంది అని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేస్తూ హోమం లో పాల్గొను భక్తులు తమ పేరు గోత్రనామాలు దేవస్థానం కౌంటర్ వద్ద నమోదు చేసుకోవాలని మరియు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని తెలియచేశారు.. పూర్తిగా ఉచితంగా అందిస్తున్న ఈ సేవలో భక్తులు పాల్గొనే భక్తులు ముందుగా దేవస్థానం కౌంటర్ లో తెలియచేసిన పూజ ద్రవ్యాలు తెచ్చుకొని పాల్గొనాలి అని తెలియజేస్తూ , శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో సిరి సంపదలు భాగ్యం పొందాలని కోరారు.
