సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానం హుండీలు నేడు, బుధవారం జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ వి. హరి సూర్య ప్రకాష్ పర్యవేక్షణలో తెరచి లెక్కించారు.. గత రెండు నెలలు కాలానికి 35,19,016/- ( ముప్పది ఐదు లక్షలు పందోమ్మిది వేల పదహారు రూపాయలు ) రాగా.. బంగారం 51 గ్రాములు, వెండి 160 గ్రాములు. కానుకలుగా వచ్చాయి. వీటితో పాటు 121 అమెరికా డాలర్ లు, 10 కెనడా డాలర్లు వచ్చాయి అని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.. ఈ కార్యక్రమం లో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వి. వెంకటేశ్వరావు, దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ , కరూర్ వైశ్య బ్యాంకు మేనేజర్ గ్రంధి రమణ సహా ఎనిమిది మంది సిబ్బంది, వివిధ ప్రాంతాలనుండి వచ్చిన సేవకులు. దేవస్థానం సిబ్బంది లెక్కింపు లో పాల్గొన్నారు.
