సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు భీమవరంలో వాడవాడలా విజయదశమి వేడుకలు కోలాహలంగా జరిగాయి. అన్ని ప్రముఖ దేవి ఆలయాలు భక్తుల కోలాహలం సాయంత్రం శమీ పూజలతో సందడిగా ఉన్నాయిభీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో దసరా వేడుకలు 10వ రోజు విజయదశమి రోజు వేడుకలలో చివరి అంకం లో భాగంగా నేడు, శనివారం మధ్యాహ్నం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నగరోత్సవం కార్యక్రమం ను భారీ హంస వాహనము ఫై స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. పట్టణ రహదారుల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. వేలాదిగా భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొన్నారు. ఉత్సవాలు చివరి రోజు కావడంతో శ్రీ అమ్మవారిని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ దర్శించుకున్నారు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ,ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదాలు శేషవస్త్రం అందజేశారు. దసరా వేడుకలను తొలిసారిగా ఇంత పెద్ద ఎత్తున చక్కగా నిర్వహించిన ఆలయ సహాయ కమిషనర్ మరియు దేవాలయ సిబ్బంది ని కేంద్ర మంత్రి వర్మ అభినందించారు. ఈనెల 14వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయ ఆవరణలో అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. దీనితో దసరా వేడుకలు పరి పూర్తీ అవుతాయి.
