సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విశేషంగా భక్తులు హాజరు అవుతున్నారు. నేడు, బుధవారం ఉదయం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న తణుకు వద్ద ఉండ్రాజవరం కు చెందిన భక్తులు కళ్లెపు నాగేశ్వరరావు విజయలక్ష్మి దంపతులు ప్రతి రోజు దేవాలయంలో జరిగే శ్రీ మావుళ్ళమ్మవారి నిత్యాన్నదానం ట్రస్టు కు 50,000 రూ కానుకగా అందజేశారు. రేపటి ( ఫిబ్రవరి 2వ తేదీ ) గురువారం నుండి శ్రీ మావుళ్ళమ్మవారు ఫిబ్రవరి 10 వ తేదీ వరకు 9 రోజుల పాటు రోజుకో దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారని కావున భక్తులు శ్రీ అమ్మవార్ల అస్సిసులు తీసుకోవాలని దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ తెలిపారు
