సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆషాడ మాసం చివరి అంకంలోకి చేరుకొంటున్న నేపథ్యంలో భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు. గురువారం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఆషాడమాస సారె సమర్పించారు. వివిధ రకాల పండ్లు ,స్వీట్లు, సుమంగళి ద్రవ్యాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి , అమ్మవారికి సారె నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు అని దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధ మహా లక్ష్మి నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఈమని చంద్రమౌళి, అధ్యక్షులు బందెల హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి ముమ్మన విజయకుమార్, కోశాధికారి బురిడి సత్య వరప్రసాద్,తోపాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *