సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ అలంకరణ కొరకు జగన్నాధపురం కి చెందిన మంతెన పాండు రంగరాజు సాయి మౌనిక దంపతులు సుమారు 2 లక్షల 30వేలు రూపాయలు విలువచేసే 20 గ్రాముల బంగారం స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా, దేవస్థానం అధికారులకు అందచేసారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు అందచేయగా..దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో వీరికి అందచేసారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానం కళా ప్రాంగణం లో మాల దీక్షదారులచే దీక్ష విరమణలో భాగంగా ఈనెల 16 వ తేది ఆదివారంతెల్లవారుజాము నుండి ఇరుముడి, పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే.. ప్రధాన హోమ గుండం. యోని గుండం నిర్మాణాలు..పూర్తి చేసి. తుది మెరుగులు దిద్ది శనివారం సాయంత్రానికి సిద్ధం చేయనున్నామని..ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *