సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ D G P మరియు ప్రస్తుత A P S R T C మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ చైర్మన్ ద్వారక తిరుమలరావు దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో అర్చకులు మరియు వేదపండితులు పూజలు మరియు ఆశీర్వచనం నిర్వహించారు..ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం,ఫోటో, ప్రసాదాలు వీరికి అందచేసినారు. D S P జయసూర్య మరియు అడిషనల్ S P భీమారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ తెలిపారు.
