సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం,లో ఇటీవల ఘనంగా నిర్వహించిన శ్రీ దేవి నవరాత్రులు ముగింపు సందర్భంగా నేడు, శుక్రవారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అన్నదాన కార్యక్రమం ను శ్రీ అమ్మవారికి ప్రత్యక పూజలు అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు గ్రంధి రవితేజ చేతులమీదుగా ప్రారంభించారు. నేడు శుక్రవారం కూడా కావడంతో వేలాది గా వచ్చిన భక్తులు శ్రీ అమ్మవారి మహాప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు మరియు ధర్మకర్తలు రామాయణం సత్యనారాయణ ,ముత్యాల రామారావు , ch శేషగిరి,మావూరి సుందరరావు , , గోపిశెట్టి విజయలక్ష్మి కోయ వెంకటలక్ష్మి , నీలాపు నాగలక్ష్మి పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
