సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, శనివారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా చండీహోమం ను ఘనంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేదపారాయణ దారులు నిర్వహించగా మొత్తం 72 మంది దంపతులు ఈ హోమం లో పాల్గొన్నారు. గత శుక్రవారం నుండి లక్షలాది గాజుల దివ్యాలంకరణతో దర్శనమిస్తున్న శ్రీ అమ్మవారిని 10 వ తేదీ ( ఆదివారం) సాయంత్రం వరకు దేవాలయం మండపం లో దర్శన అవకాశం కల్పించడం జరిగింది. అమ్మవారికి అలంకరణ చేసిన గాజులను 11 వ తేదీ సోమవారం ఉదయం నుండి గురువారం వరకు మరల 16వ తేది శనివారం నుండి 21 వ తేదీ గురువారం వరకు అంతరాలయంలో శ్రీ అమ్మవారి దర్శనం సమయంలో మహిళా భక్తులకు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుందని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు. భక్తులకు.. ఫై తేదీలలో వితరణ చేయడానికి సుమారు పది లక్షలు గాజులు ఉన్నాయి కాబట్టి భక్తులు వారి సమయాలు వీలును బట్టి నిదానంగా వచ్చి స్వీకరించి తరించి వలసిందిగా తెలిపారు.
