సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా చండీహోమం ఘనంగా నిర్వహించినారు.ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేద పండితులు హోమo నిర్వహించినారు.55 మంది దంపతులు ఈ హోమం లో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. రేపు ఆదివారం ఉదయం నుండి తెలుగు సంవత్సరాది ప్రారంభంగా ఉగాది పండుగ నేపథ్యంలో దేవాలయంలో ఉదయం నుండి రాత్రి వరకు జరిగే ఎన్నో తెలుగు సాంప్రదాయ కార్యక్రమాలకు విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక భీమేశ్వర స్వామి దేవాలయంలో కూడా రేపు ఉదయం 8 గంటల నుండి ఉగాది వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *