సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో నిత్యం జరిగే భక్తులకు అన్నసమారాధన కోసం శాశ్వత నిత్యాన్నదాన ప్రసాద వితరణకి నేడు, బుధవారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు గొట్టుముక్కల సత్యనారాయణరాజు, శైలజా దంపతులు 25,000 రూ,మరియు గొట్టుముక్కల వెంకటపవన్ కుమార్, శ్వేత దంపతులు 25,000 రూ, భూపతిరాజు ఆనంద్ విజయ వర్మ శ్రీలలిత దంపతులు 25,000 రూ వేగేశ్న రాజాం రాజు లీలాకుమారి దంపతులు 25,000 రూ చప్పున మొత్తం లక్ష రూపాయలు కానుకగా అందజేశారు. . వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ శ్రీ అమ్మవారి పూజలు నిర్వహించారు.వారికీ ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదాలు శేషవస్త్రం ఫోటో అంజేశారు.
