సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఉదయం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పాద మండలి దీక్ష (11రోజులు) కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 141 మంది భక్తులు శ్రీ అమ్మవారి మాల ధరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ , ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. మాలధారణ చేసిన స్వాములకు ఆలయ ఆవరణలో అన్న సమారాధన నిర్వహించారు.
