సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి స్థానిక భక్తురాలు ఎం ప్రత్యూష 8 గ్రాముల బంగారం కానుక అందజేశారు. నేడు శనివారం .. జనవరి 13 నుండి జరుగు 60 వ వార్షిక మహోత్యవాలు కొరకు శ్రీ అమ్మవారి మూలవిరాట్ దర్శనం ఈ రోజు ఉదయం 10-30 గంటలకు ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ మరియు వేదపారాయణదారులు కళాపకర్షణ జరిపి మూసివేయడమయినది. తిరిగి ది 28-12-2023 తేదీన ఉదయం 11-00 గంటలకు భక్తులకు మూలవిరాట్ దర్శనం పునఃప్రారంభం అవుతుందని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణధికారి యర్రంశెట్టి భద్రాజీ. తెలిపారు. . ఈ కార్యక్రమం లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, మానేపల్లి నాగేశ్వరరావు ధర్మకర్తలు ముత్యాల రామారావు,రామాయణం సత్యనారాయణ, మావూరి సుందరరావు, తాళ్లపూడి భాగ్యలక్ష్మి , గోపిశెట్టి విజయలక్ష్మి , మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *