సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు మంగళవారం (ది 07-10-2025 న) ఆశ్వీయుజ శుద్ధపౌర్ణమి కావున శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మండలి దీక్షా మాలధారణ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ కలశస్థాపన పూజ జరిపి, ప్రారంబించారు. 145 మంది భక్తులు 40 రోజుల పాటు శ్రీ అమ్మవారి అనుగ్రహం కోసం నిష్ఠగా చేసే మండల దీక్షా మాలధారణ ధరించారని, వీరికి వచ్చే నవంబర్ 16న ఆదివారం దీక్ష విరమణ మరియు పూర్ణాహుతి యజ్ఞం ఉంటుందని ఆలయ సహాయ కమిషనర్, బుద్ధా మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
