సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో నేటి మంగళవారం సాయంత్రం ధన త్రయోదశి పర్వదినమున శ్రీ మహాలక్ష్మి ధన ధాన్య ధన్వంతరి పూజోత్యవం కార్యక్రమం ఫ్లడ్ లైట్స్ వెలుగులతో అత్యంత శోభాయమానంగా ఆలయ ఆవరణలో విశేష పుష్ప అలంకరణలు తో నిర్వహించారు. విశేషంగా మహిళలతో పాటు వందలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మి పూజ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో దేవాలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు
