సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో శ్రీ మహాలక్ష్మి ప్రద మాసం లో వచ్చిన మార్గశిర పౌర్ణమి సందర్బంగా.. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో భక్తులు ..సిరి సంపదలు పొందాలి అన్న సంకల్పంతో.. విశేషమైన చండీహోమం దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు మరియు వేదపారాయణ దారులు ఘనంగా నిర్వహించారు. ఈ హోమం లో 100 మంది పైగా దంపతులు పాల్గొన్నారని, తమ గోత్ర నామాలు తెలిపి పీజు చెల్లించి పరోక్ష పధ్ధతిలో కూడా.. మరి కొంతమంది పాల్గొన్నారు అని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. .. హోమం లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించిన అనంతరం మేళ తాళాలుతో ఆ భక్తులకు ప్రత్యేక దర్శనం చేయించామని అనంతరం అన్న సంతర్పణలో ప్రసాదాలు అందజేశామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *