సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ మొదలుకొని నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలు అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఎంతో ఆసక్తి.. మరి మరో 5వారాలలో ప్రారంభమయ్యే ఆ ఉత్సవాల కోసం ఏర్పాట్లు నేటి గురువారం నుండి ప్రారంభమయ్యాయి.శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60 వ వార్షిక జాతర మహోత్సవాలు సందర్భంగా నేటి ఉదయం ఉదయం 11 గంటలకు ప్రత్యక పూజలు అనంతరం చలువ పందిరి “రాట” ముహూర్తం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీరుల్లి కూరగాయల వర్తక సంఘం సభ్యులు మరియు దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు
